Telugu Desam Party leader and Anantapur MP JC Diwakar Reddy make hot comments against Pawan kalyan and chiranjeevi in Amaravati on Thursday.
తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి గురువారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. జేసీ తరుచూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నాయకత్వంలో గుర్నాథ్ రెడ్డి (వైసీపీ నుంచి టీడీపీలో చేరితే) పని చేసే విషయం.. తదితర అంశాలపై జేసీ అమరావతిలో మాట్లాడారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తన సోదరుడు చిరంజీవి పెద్ద శాపం అని జేసీ వ్యాఖ్యానించారు. నాడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, ఆ పార్టీని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని గుర్తు చేశారు. చిరంజీవి పెద్ద పొరపాటు చేశారని వ్యాఖ్యానించారు. చిరు చేసిన పొరపాటు పవన్‌కు మైనస్ అని అభిప్రాయపడ్డారు.